calender_icon.png 23 January, 2026 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌‌‌రరపెస్

23-01-2026 12:00:00 AM

  1. చర్లపల్లి, తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలు
  2. తెలుగు రాష్ట్రాల్లో 9 స్టేషన్లలో హాల్ట్
  3. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్, జనవరి 22(విజయక్రాంతి): తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌‌‌రరపెస్‌ను రైల్వేశాఖ కేటాయించింది. చర్లపల్లి జంక్షన్ నుంచి తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలును నడపనుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం, తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు రైల్వేస్టేషన్లలో ఆగనుండడంతో ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉండనుంది. ఈ అమృత్ భారత్ రైలును శుక్రవారం తిరువనంతపురం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారం భించనున్నారు.

తెలంగాణలో నల్లండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో అమృత్ భారత్ ఎక్స్‌‌‌రరపెస్ ఆగనుంది. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు ప్రారంభ మై.. చర్లపల్లికి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు చేరుకుంటుంది. తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కేటాయించడం పట్ల.. ప్రధాని మోదీకి కేంద్రమంత్రి కిషన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

చర్లపల్లి ముజఫర్‌పూర్ (బిహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పటికే నడుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక వసతులున్న అమృత్ భారత్ రైలును కేంద్రం చర్లపల్లి -ముజఫర్‌పూర్ మధ్య ప్రవేశపెట్టింది. ఈ రైలు తెలంగాణలోని చర్లపల్లి నుంచి ఉద యం 4.05 గంటలకు ప్రారంభమై.. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగ జ్నగర్ మీదుగా మహారాష్ట్రలోకి అడుగుపెడుతుంది. ముజఫర్‌పూర్‌కు మరునాడు సా యంత్రం 4 గంటలకు చేరుకుంటుంది.