calender_icon.png 18 December, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలమైన కథా నేపథ్యంతో గుర్రం పాపిరెడ్డి

18-12-2025 01:17:45 AM

నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. దర్శకుడు మురళీమనోహర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 19న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఇంటర్వ్యూలో హీరో నరేశ్ అగస్త్య సినిమా హైలైట్స్ తెలిపారు. “-గతంలో నేను నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్ సెటిల్డ్‌గా ఉంటాయి.

ఇందులో కొంచెం ఎనర్జిటిక్‌గా నేనే లీడ్ తీసుకునేలా ఉంటుంది. తెలివైనవాడు తెలివితక్కువ పనిచేస్తే, తెలివి లేనివాళ్లు తెలివైన పనిచేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటనేది ఈ మూవీ స్టోరీలైన్. సినిమా అంతా ఫన్ జోన్‌లో వెళ్తుంటుంది. బలమైన కథ ఉంది. ప్రతి సీన్ కామెడీగా వెళ్తున్నా వెనక ఒక స్ట్రాంగ్ స్టోరీ రన్ అవుతుంటుంది. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే పాటలు, ఫైట్స్ లేకున్నా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగేది. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో పక్కా కమర్షియల్ మూవీ లేదు.  వచ్చే ఏడాది అలాంటి మూవీ చేయబోతున్నా” అన్నారు.