calender_icon.png 18 December, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిసారి ఫుల్లుగా కామెడీ చేశా

17-12-2025 01:22:23 AM

సౌతిండియా హాట్ ఫెవరెట్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్, హీరోయిజాన్ని ఫర్ఫెక్ట్‌గా ప్లే చేసే హీరో నవీన్‌చంద్ర.. పవర్ ఫుల్ రోల్స్‌లో రూపొందుతున్న తాజాచిత్రం ‘పోలీస్ కంప్లుంట్’. డైరెక్టర్ సంజీవ్ మేగోటి హారర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తు న్న ఈ చిత్రంలో ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేశ్, దిల్ రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భం గా వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశా. ఇందులో యాక్షన్‌తోపాటు ఫుల్లుగా కామెడీ చేశా” అన్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. “ప్రేమ, పగ, తప్పొప్పులు, మంచిచెడుల మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ కూడా.

కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో థ్రిల్ చేస్తారు. స్క్రీన్‌ప్లే ఉత్కంఠభరితంగా ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం కన్నడం.. నాలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నాం” అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ తొలిసారి ఫుల్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఆమెకు జంటగా నవీన్‌చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు’ అని తెలిపారు.