calender_icon.png 10 July, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాల తనిఖీ

10-07-2025 12:11:56 AM

శామీర్‌పేట్ జూలై 9 : సామాన్యుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న వసతులను విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేలా చూడడం అధికారుల బాధ్యత అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికగుప్తా అన్నారు. బు ధవారం శామీర్ పేట మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

విద్యార్థుల వసతులు, ఆహార నా ణ్యత, పరిశుభ్రత , విద్య బోధన వంటి ముఖ్య అంశాలపై సమగ్రంగా పరిశీలించారు. స్కూల్లో వసతులు ఎలా ఉన్నాయని, భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకొని, మెను చార్టును పరిశీలించారు.

గురుకుల ప్రాంగణం శుభ్రంగా ఉండేలా చూడాలని, వైద్య సదుపాయాలు అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేలా చూడడం అధికారుల బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి విజయ కుమారి, జిల్లా బిసి సంక్షేమ శాఖాధికారి ఝాన్సీరాణి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, గురుకుల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.