calender_icon.png 10 July, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సమ్మె విజయవంతం

10-07-2025 12:10:48 AM

ఘట్ కేసర్, జూలై 9 : కార్మికలోకం సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పిలుపిచ్చిన సమ్మె విజయవంతంగా ముగిసింది. ఈసమ్మెలో కార్మికులతో పాటు సిఐటియు, ఎ ఐటియుసి నాయకులు పాల్గొన్నారు. ముందుగా జోడిమెట్ల నుండి బైకులు మరియు కార్లతో ఘట్ కేసర్ పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియూ నాయకులు చింతల యాదయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్. సబిత, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కె. జయచంద్ర సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎన్. సృజన హాజరయ్యారు.

అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ట్రాన్స్ పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు కడమంచి యాదగిరి, పోచారం మున్సిపల్ అధ్యక్షులు గాంధారి అశోక్, ఘట్కేసర్ మునిసిపల్ అధ్యక్షుడు ఎం. రామచందర్, అంగన్ వాడి రాష్ట్ర అధ్యక్షురాలు పేరి జాన్, జిల్లా అధ్యక్షురాలు సుచిత్ర, ఆశ మం డల అధ్యక్షురాలు ఎస్. లక్ష్మి, మధ్యాహ్న భోజన మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పుష్ప, పిఎన్‌ఎం కళాకారుడు కొండూరి భాస్కర్, ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షుడు కొయ్యడ చంద్రమోహన్, గుర్రం నాగమణి, చంద్రశేఖర్, మల్లేష్, ముత్తమ్మ, ఎ. వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.