calender_icon.png 14 October, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

14-10-2025 12:20:20 AM

మృతదేహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ రూరల్, అక్టోబర్ 13 :  మహబూబ్ నగర్ రూరల్ మండలం  రామిరెడ్డి గూడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియర్ మొదటి సంవత్సరం చదువుతున్న యు.ప్రి యాంక సోమవారం ఉదయం 7.10 నిమిషాల  ప్రాంతంలో గురుకుల కళాశాల హాస్టల్ బాత్  రూం కిటికీ కి ఉరి వేసుకుని చనిపోయిన ఘటన చోటు చేసుకుంది.

విద్యార్థిని మృతికి సంబంధించి పూర్తిస్థాయిలో  అధికారులతో విచారణ  జరుపనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ఆమె మృత దేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి తీసుకురావ్గం జరిగింది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి.లో విద్యార్థిని మృత దేహాన్ని ఉంచిన ఐ సి. యు వార్డ్ కు వెళ్ళి విద్యార్థిని  తండ్రి యు.

నాగయ్య ను పరామర్శించి  వ్యక్తం చేశారు. సంఘటన గురించి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వాణిశ్రీ తో మాట్లాడి తెలుసుకున్నారు.జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రంగా అజ్మీరా తో మాట్లాడి మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఉన్నారు.