14-10-2025 12:21:01 AM
భీమేశ్వర ఆలయం ఏర్పాట్ల పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రాజన్న ఆలయ అభివృద్ధి విస్తర ణలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.. సోమవారం భీమేశ్వర ఆలయంలో తుది దశకు చేరిన ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.
మాట్లాడుతూ. రాజన్న ఆలయం అభివృద్ధి విస్తరణ చేపడుతున్న నేపథ్యంలో భక్తులకు స్వామి వారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయ భక్తుల వసతులపై ప్రత్యేక దృష్టి సారించి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. రోజు రోజుకు పెరుగు తున్న భక్తుల దుష్ట్య 150 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు సాగుతున్నయని తెలిపారు.
విస్తరణ సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అతి ప్రాచీనమైన అత్యంత విశిష్టత కలిగిన భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభం చేసుకోవడం జరిగిందన్నారు. రాజన్న ఆలయం బంద్ అనేది ఆ వాస్తవమని ప్రతినిత్యం రాజన్నాలయంలో స్వామివారికి నిత్య పూజలు ఏకాంతంగా జరుగుతాయన్నారు.రాజన్న ఆలయంలో పనులు జరిగే క్రమంలో భీమేశ్వరాలయంలో ప్రత్యేకంగా దర్శనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తాం అన్నారు. వెంట ఈవో రమాదేవి ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ ఏ ఈ ఓ బ్రాహ్మణ శ్రీనివాస్, ఉమేష్ శర్మ ఆలయ ఇన్చార్జి స్థానాచారి నమిలికొండ ఉమేష్ శర్మ తదితరులు ఉన్నారు..