జిల్లాలో వడగళ్ల వాన
21-03-2026 12:33 AM
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన (రాళ్ల వాన) కురిసింది. పాల్వంచ పట్టణ పరిధిలోని పాల్వంచ, పాత పాల్వంచ, నవభారత్, కొత్తగూడెం ప్రాంతాల్లో రాళ్లతో కూడిన వర్షం కురిసింది. చిన్నారులు, మహిళలు రాళ్లను చూస్తూ కేరింతలు కొట్టారు. ఉదయం నుంచి కొంతసేపు ఎండ, మరి కొంతసేపు మబ్బులతో కూడిన వాతావరణం నెలకొని ఉంది. సాయంత్రం ఆరు గంటలకు ఒక్కసారిగా వడగళ్ల వాన జోరున కురిసింది. దీంతో వాతావరణం కొంత చల్లబడింది




