హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఎంపీ గోడం నగేష్ ఆరోపణ
ఆదిలాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు.
అనంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ l, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ... రైతులకు రావాల్సిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలని మోసగిస్తోందని ద్వజమెత్తారు. రైతు భరోసా నిధులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేం ద్రం అమలు చేసే పసల్ బీమా యోజన పథకం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేదవ్యాస్, హనుమండ్లు, శివ గౌడ్, ధోనే జ్యోతి, పలువు రు కార్యకర్తలు పాల్గొన్నారు.




