04-10-2025 09:18:07 AM
వాషింగ్టన్: యుద్ధం ముగించేందుకు హమస్(Hamas)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) గడువు విధించారు. రేపటితో యుద్ధం ముగించేందుకు ఒప్పందం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఒప్పందం చేసుకోకపోతే హమాస్ కు నరకం చూపిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలతో హమాస్ దిగివస్తోంది. ఇజ్రాయెల్ బందీలను(Israeli hostages) విడుదల చేయడానికి అంగీకరించింది. గాజా శాంతి ప్రణాళిక 20 పాయింట్స్ కు మద్దతు ఇస్తున్నట్లు హమాస్ తెలిపింది. గాజా పరిపాలనను పాలస్తీనా టెక్నోక్రాట్స్(Palestinian technocrats) అప్పగించేందుకు హమాస్ సిద్ధమని పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా గాజాపై దాడులను వెంటనే ఆపాలని ట్రంప్(Donald Trump) హెచ్చరించారు. గాజాలో యుద్దానికి ముగింపు పలికేందుకు సిద్ధమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ట్రంప్ తొలి దశ ప్రణాళిక అమలుకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas war) రెండూ శాంతి ఒప్పందంపై అంగీకరించాలని ఒత్తిడి చేస్తున్న ట్రంప్, పోరాటాన్ని వెంటనే నిలిపివేయాలని పిలుపునివ్వడమే కాకుండా, గాజా యుద్ధానంతర పాలనకు ఒక చట్రాన్ని కూడా నిర్దేశించిన 20 అంశాల ప్రతిపాదనను వివరించారు. సంఘర్షణను ముగించడానికి, భూభాగం భవిష్యత్తు పరిపాలనను రూపొందించడానికి రెండింటికీ ఒక రోడ్‌మ్యాప్‌గా వైట్ హౌస్ ఈ ప్రణాళికను విడుదల చేసింది. తక్షణ కాల్పుల విరమణ, పూర్తి బందీ-ఖైదీ మార్పిడి, గాజా నుండి ఇజ్రాయెల్(Israel) దశలవారీగా ఉపసంహరణ, హమాస్ నిరాయుధీకరణ, అంతర్జాతీయ పర్యవేక్షణలో పరివర్తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కోరింది.