calender_icon.png 4 October, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవోకే ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే!

04-10-2025 02:38:29 AM

  1. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది  
  2. ప్రపంచ దేశాలు స్పందించాలి పాక్ ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయాలి
  3. ఓ ప్రకటనలో భారత విదేశాంగశాఖ పిలుపు

ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ, అక్టోబర్ 3: పాకిస్థాన్ సైన్యం పాక్ విచక్షణారాహిత్యంగా కాల్పులు జరుపు తూ ఆక్రమి త కశ్మీర్ (పీవోకే) పౌరులను పొట్టనపెట్టుకున్న ఘటనలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈమేరకు శుక్రవారం న్యూఢిల్లీలోని దేశ విదేశాంగ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. పీవోకే ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని విదేశాంగశాఖ పు నరు ద్ఘాటించింది. అక్కడి పౌరుల ను పాకిస్థాన్ దశాబ్దాలుగా అణచివేస్తున్నదని, అక్కడ మా నవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని పేర్కొంది. ప్రపం చ దేశాలు అందుకు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా చేయాలని పిలుపునిచ్చింది.  అశాంతికి పాక్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలేనని ధ్వజమెత్తింది.

పాక్ సైన్యం కాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది మృతి

భారత సరిహద్దుల్లోని పీవోకేలో పాకిస్థాన్ సైన్యం రెచ్చిపోతున్దని. అరాచకాలు సృష్టిస్తున్నది. ధిర్కోట్, ముజఫరాబాద్, బాఫ్‌ు, మిర్‌పుర్ ప్రాంత ప్రజల పై కొద్దిరోజులుగా కాల్పులు జరుపుతున్నది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది మృతిచెందారు. దాదాపు 200 మంది క్షతగాత్రులయ్యారు. పాక్ సైనికుల కాల్పుల కారణంగా పీవోకే ప్రజలు వణికిపోతున్నా రు. అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో పీవో కే ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

తమకు మౌలిక వసతులు కల్పించాలని అక్క డి ప్రజలు 38 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. పాక్ సర్కార్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి గళ మెత్తుతున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పీవోకేలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీంతో అవామీ యాక్షన్ కమిటీ నేత షౌకత్ నవాజ్‌మిర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.