ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అధినేత మృతి
హమాస్: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందారు. యాహ్యా సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ధ్రృవీకరించింది. డీఎన్ఏ ఆధారంగా సిన్వర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి తెలిపారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడిలో సిన్వర్ కీలక సూత్రధారని ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురువారం సాయంత్రం దక్షిణ గాజాలోని రఫాలో లక్ష్యంగా చేసుకున్న గ్రౌండ్ ఆపరేషన్‌లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ప్రకటించింది. ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు హమాస్ మిలిటెంట్లలో సిన్వార్ కూడా ఉన్నాడు. సిన్వర్ మృతి ఇజ్రాయెల్ కు, ప్రపంచానికి మంచిరోజు అని జో బైడెన్ తెలిపారు. బందీల విడుదల కు ఒప్పందం కుదిరి యుద్ధం ముగుస్తుందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాహ్యా సిన్వార్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1962లో జన్మించాడు.






