ఎలుకపల్లి గ్రామంలో చేతిపంపుకు మరమ్మత్తులు
01-03-2026 04:17 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుకపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి ఆదివారం చేతి పంపు మరమ్మత్తులు చేయించారు. అసలే వేసవికాలం ప్రారంభం కావడంతో చేతిపంపు చెడిపోయి తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని కాలనీ ప్రజలు తెలపడంతో వెంటనే సానుకూలంగా స్పందించి చేతిపంపుకు మరమ్మత్తులు వార్డు సభ్యులు రామడుగుల రమేష్ దగ్గర ఉండి బాగు చేయించారు. చేతి పంపు బాగు చేయించి సమస్య పరిష్కరించినందుకు కాలనీ ప్రజలు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.




