calender_icon.png 17 February, 2026 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో హస్తం హవా

17-02-2026 12:07:51 AM

  1. మెదక్‌లో ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి దక్కించుకున్న కాంగ్రెస్ 

నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్, వైస్ ఛైర్మన్ బీజేపీ

రామాయంపెట్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం

తూప్రాన్ మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ డే 

మెదక్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి) :మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపెట్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తూప్రాన్ మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది. సోమవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కానుగు రాధిక మున్సిపల్ చైర్మన్ గా కానుగు రాధిక ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ ఎన్నికయ్యారు.

నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కి చెందిన లక్ష్మీ రాజ్ యాదవ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీజేపీ కి చెందిన బుచ్చేష్ యాదవ్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కు 6 సీట్లు రాగా, బీఆర్‌ఎస్ పార్టీకి ఐదు సీట్లు, బీజేపీ పార్టీకి నాలుగు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మాచునూరి లక్ష్మి చైర్ పర్సన్ గా, బీజేపీ నుంచి గెలిచిన బుచ్చేష్ యాదవ్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.

రామాయంపెట్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ 1వ అభ్యర్థి గజవాడ లావణ్య చైర్మన్ గా ఎన్నిక కాగా, 12వ అభ్యర్థి పొచ్చమల నవనీత వైస్ చైర్మన్ గాఎన్నికయ్యారు. 

తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం బిఆర్‌ఎస్ మెజారిటీ కౌన్సిలర్లు ఉన్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ 1వ వార్డు అభ్యర్థి బొంది రజిని రవీందర్ గౌడ్ ను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్టు స్పెషల్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి తెలిపారు. వైస్ చైర్మన్ గా కొక్కొండ సమత కాశిరెడ్డి ఎన్నికయ్యారు.