calender_icon.png 17 February, 2026 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సహాయ ఉపకరణాల అభ్యర్థుల ఎంపిక నిమిత్తం సర్టిఫికెట్ల పరిశీలన

17-02-2026 12:06:16 AM

గద్వాల, ఫిబ్రవరి 16 : జిల్లాలో దివ్యాంగుల సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక నిమిత్తం సర్టిఫికేట్ పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరి శీలన కార్యక్రమం ఈ నెల 18వ తేదీన ఐడిఓసి లోని మహిళా, శిశు, దివ్యాంగుల మరి యు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం. 33లో నిర్వహించబడు తుందని ఆమె తెలిపారు.

హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ సర్టిఫికె ట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులను మరియు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు సదరం సర్టిఫికేట్, ఆధార్, రేషన్, కుల, ఆదాయ దృవీకరణ పత్రం,  విద్యా ధ్రువ పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్ మరియు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్ కు దరఖాస్తు చేసిన వారు రూ.100/-  బాండ్ పేపర్ పై నిరుద్యోగ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసు కొని రావలెను. పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులను అనర్హులుగా పరిగణించబడుతారని ఆమె స్పష్టం చేశారు.