నిగమాగమంలో చేనేత వస్త్ర ప్రదర్శన
ప్రారంభించిన నేషనల్ హ్యాండ్లూమ్ ఇక్కత్ సిల్క్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): భారతీయ సాంస్కృతిక చేనేత కళలను ప్రపంచానికి చాటాలని నేషనల్ హ్యాండ్లూమ్ ఇక్కత్ సిల్క్ బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఏసియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ అన్నారు. బుధవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. గత నెల ఇంటర్నేషనల్ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై ఇక్కత్ సిల్క్ కి విశేష స్పందన లభించిందని తెలిపారు.
బోనాలు, ఆషాడమాసంతో పాటు పలు పండుగలు, శుభకార్యాలకు అనుగుణంగా ప్రత్యేక చీరలను ఇక్కడ ఏర్పాటు చేశారు. చేనేత వస్త్రాలను ప్రతిఒక్కరూ ధరించాలని, భాద్యతగా కొనుగోలు చేయాలని ఆమె ఆశాభావం తెలుపుతూ ప్రదర్శనలోని వస్త్రాలను తిలకించి చేనేతలను అభినందించారు. ప్రముఖ నగరాలకు చెందిన చేనేతకారులు తమ ఉత్పత్తులైన సిల్క్, కాటన్, డిజైనరీ వస్త్రాలను సుమారు 80స్టాల్స్‌లో ప్రదర్శించే నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్ కుమార్ చెప్పారు. ఈ నెల 22వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు.






