16 July, 2026 | 12:43 AM

ఎస్‌ఐపీ అబాకస్ విద్యార్థుల సత్తా

16-07-2026 12:00 AM

మెంటల్ అర్థమెటిక్ ప్రాడిజీ పోటీల్లో విజయం

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఎస్‌ఐపీ అబాకస్ 22వ అకాడమీ, ప్రాంతీయ ప్రాడిజీ 26 సోషియబుల్ ఇంటెలెక్చువల్ ప్రోగ్రెసివ్ అకాడమీ ఎస్‌ఐపీ అబాకస్, మెంటల్ అర్థమెటిక్ ప్రాడిజీ 2026 పోటీ లు రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌లోని ’క్లాసిక్ కన్వెన్షన్ త్రీ’ వేది కగా ఈ నెల 12న ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో తెలంగాణ నలుమూలల నుంచి దాదాపు 3,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్‌ఐపీ అబాకస్ మణికొండ బ్రాంచ్ నుంచి మాస్టర్  అక్షయరెడ్డి ఛాంపియన్‌గా నిలవగా 43 మంది విద్యార్థులు వివిధ క్యాటగిరీలో విజేతలుగా నిలిచారు.

మణికొండ కేంద్రానికి చెందిన 73 మంది విద్యార్థులు వివిధ విభాగాలలో 1వ, 2వ, 3వ బహుమతులను కైవసం చేసుకున్నారు. వివిధ కేటగిరీలలో మణికొండకు చెందిన ఎస్‌ఐపీ అబాకస్ మణికొండ బ్రాంచ్ నుంచి గ్రాండ్ మాస్టర్స్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన 28 మంది విద్యార్థులు పట్టభద్రుల వేడుకలో పాల్గొన్నారు. ఈ నెల 13న జ్ఞానవాటిక ప్రాంగణంలో సెంటర్ హెడ్ గాద్ది శ్రీవాణి కరణ్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.