calender_icon.png 26 December, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమారుడికి ఉరివేసి..

08-10-2024 02:15:37 AM

ఆపై తానూ ఆత్మహత్య

యాదాద్రి జిల్లా పెద్దరావులపల్లిలో విషాదం

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కుమారుడి అనారోగ్యంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న ఆ తల్లి మొదట అతడికి ఉరివేసి ఆతర్వాత తాను కూడా ఉరివేసుకున్న విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పెద్దరావులపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దరావులపల్లికి చెందిన జడల రాజు, సోని(31) దంపతులకు ఇద్దరు కుమారులు.

వీరిలో చిన్న కుమారుడు శ్రేయాన్స్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే, కుమారుడి అనారోగ్య సమస్యను తట్టుకోలేని తల్లి.. సోమవారం కుమారుడికి ఉరివేసి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు భూదాన్‌పోచంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.