calender_icon.png 12 May, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లికి పాదాభివందనం చేసిన మాజీ ఎమ్మెల్యే

11-05-2025 06:16:40 PM

స్వచ్ఛమైన ప్రేమకు అమ్మ ఆప్యాయత

కామారెడ్డి,(విజయక్రాంతి): మాతృమూర్తి అమ్మ ఆప్యాయత ఎంతో గొప్పదని కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అన్నారు. మాతృ దినోత్సవ సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే తన తల్లి కాళ్ళకు పాదాభివందనం చేశారు. మాతృ దినోత్సవం సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తన తల్లి కి పాదాభివందనం చేసి  నమస్కరించారు. అనంతరం ఆయన అమ్మ ఆప్యాయత అనురాగాలకు చిరునామా అమ్మ అని కొని యాడారు. స్వచ్ఛమైన ప్రేమ ప్రతిరూపం అమ్మ అని అన్నారు. మాతృమూర్తుల అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలిపారు.