12-05-2025 08:56:09 AM
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం(Chhattisgarh Road accident) సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రాయ్‌పూర్-బలోదాబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో అర్థరాత్రి వాహనాన్ని ఢీకట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పిల్లలు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. చటౌడ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి బన్సారీ గ్రామానికి వెళ్లిందని పోలీసు అధికారులు తెలిపారు.
తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రక్కు ఖరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సారగావ్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందిన తర్వాత, పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపి, గాయపడిన వారిని రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. జిల్లా పరిపాలన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్(Raipur District Collector Gaurav Singh) తెలిపారు. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 11 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.