11-05-2025 05:31:15 PM
కాటారంలో సంజీవిని ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ అన్నారు. మంథని నియోజకవర్గంలోని కాటారంలో ఆదివారం సంజీవిని ఆసుపత్రిని మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుముళ్ల ప్రాంతమైన కాటారం లో ఆస్పత్రి ఏర్పాటు చేయడం ద్వారా చుట్టు నాలుగు మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన చికిత్స అందించి, ఆరోగ్యంగా ఇంటికి పంపించాలని, అప్పుడే ప్రజలకు వైద్యులపై నమ్మకం కలుగుతుందని మంత్రి సూచించారు.
కాటారంలో ఆసుపత్రి ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ ఫట్నార్ మోత్కూరి శ్రీనివాస్ పిటు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సమ్మయ్య, మంథని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ శర్మ అవధాని, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్, కుడుదుల వెంకన్న తో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.