3 April, 2026 | 2:44 AM

ఘనంగా హనుమాన్ జయంతి

03-04-2026 12:51 AM

పాల్గొన ఎమ్మెల్యేలు, బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్ దంపతులు, తులసీ ప్రకాశ్‌రావు 

సికింద్రాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హనుమాన్ జయంతిని పురష్కరించుకుని బోయిన్ పల్లి సెంటర్ పాయింట్ చౌరస్తా లో  సెంటర్ పాయింట్ షాప్స్ అసోసియేషన్, పాండు యాదవ్ యువసేన, బ్రైట్ డ్రై క్లినింగ్ నిర్వాహకులు తులసి ప్రకాష్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అం గరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్,స్థానిక ఎమ్మెల్యే, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు కే.విద్యావతి పాండు యాదవ్, మాజీ చైర్మన్లు టి.ఎన్.శ్రీనివాస్,

గజ్జల నగేష్, ముప్పిడి మధుకర్, బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ హనుమంత్, విశ్వనాధ్   తదితరులు హాజరైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొ న్నారు. భక్తుల పెద్ద సంఖ్యలో హాజరై అన్న ప్రసాద్ లు సేకరించారు..ఈ కార్యక్రమంలో బ్రైట్ డ్రై క్లీనింగ్ నిర్వహకులు తులసి ప్రకాష్ రావు, చిన్నికృష్ణ, నర్సింహ,మురళి, శ్రీనివాస్ యాదవ్,అనిల్, అశోక్,అమర్,మనోజ్ యాదవ్,రాజు తదితరులు పాల్గొన్నారు.