3 April, 2026 | 3:14 AM

బహుజనుల బంధూక్ సర్వాయి పాపన్న

03-04-2026 12:50 AM

సర్ధార్ సర్వాయి పాపన్న వర్ధంతి సభలో పలువురు వక్తలు

ముషీరాబాద్,ఏప్రిల్ 2(విజయక్రాంతి): బహుజనుల బంధూక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పలువురు వక్తలు కొనియాడారు.  పాపన్న ఆశయాలను నెరవేర్చిన ప్పుడే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని వారు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘాల సమన్వయ కమిటీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో  నిర్వహిం చిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316 వర్ధంతి సభ బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్బంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావుల  ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల రాజ్ గౌడ్, వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్,  కన్వీనర్ లు అయిలి వెంక న్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బైరి శేఖర్, అరుణోదయ  సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క తదితరులు హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న సామాన్య కల్లుగీత వృత్తిని చేసుకుంటూనే బహుజన రాజ్యాన్ని నిర్మించిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావా దని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు  బత్తిని కీర్తి లతా,  లింగేష్ యాదవ్, సింగం నాగేశ్వర్, చెన్న శ్రీకాంత్ నేత తదితరులు పాల్గొన్నారు.