3 April, 2026 | 2:44 AM

వనతి శ్రీనివాసన్‌ను కలిసిన పద్మ వీరపనేని

03-04-2026 12:53 AM

జూబ్లిహిల్స్, ఏప్రిల్ 2(విజయక్రాంతి): బిజెపి మహిళా మోర్చా జాతీయ నాయకురాలు.. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి డాక్టర్ పద్మ వీరపనేని మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ను కలిశారు. గురువారం ప్రత్యేకంగా వాటితో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యం గా బూత్ స్థాయిలో మహిళా కార్యకర్తలు నిర్వహిస్తున్న ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, ఓటర్లను ఆకట్టుకోవడంలో అనుసరిస్తున్న వ్యూహాలను డాక్టర్ పద్మ జాతీయ అధ్యక్షురాలికి వివరించారు. ఎన్నికల్లో మహిళా శక్తి కీలక పాత్ర పోషించబోతోందని, ప్రచార వేగాన్ని మరింత పెంచాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.