13 May, 2026 | 1:32 AM

పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి

13-05-2026 12:00 AM

ముకరంపుర, మే 12 (విజయ క్రాంతి): నగరంలోని 8వ డివిజన్ అలుగునూర్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు తిరునగరి వెంకటాద్రి స్వామి, హర్షవర్ధన్ స్వామిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిందం నరసయ్య, గడప శేఖర్, సిరిపురం శ్రీనివాస్, సల్ల మల్లేశం, బూట్లకరుణాకర్, రాజేంద్రప్రసాద్, రాజిరెడ్డి, సుధాకర్ రెడ్డి, మృత్యుంజయం, కొట్టాల శ్రీనివాస్, చిందం అంజి, చిందం మహేష్, తదితరులు పాల్గొన్నారు.