1 July, 2026 | 6:42 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

వైభవంగా హనుమాన్ జయంతి

13-05-2026 12:44 AM

ఘట్ కేసర్, మే 12 విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్ శివారెడ్డిగూడలోని శ్రీదండ్లగడ్డ ప్రసన్న వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం  హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హనుమజ్జయంతి సందర్భంగా అర్చకుల మంత్రోచ్చారణాల మధ్య  మంగళవారం ఉదయం 6 గంటలకు అంజనేయస్వామికి అష్టోత్తరశత కలశాలతో విశేష అభిషేకం, అర్చన, మంగళహారతి నిర్వహించారు. ఉదయం 9 గంటలకు సుందరాకాండ పారాయణం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు శ్రీ దండ్లగడ్డ ప్రసన్నవీరాంజనేయస్వామికి పల్లకి ఉత్సవం నిర్వహించబడిoది.