నేడు పాలీసెట్
హాజరుకానున్న 1.06 లక్షల మంది విద్యార్థులు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెస్ట్ టెస్ట్ (పాలీసెట్)-2026 నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షకు మొత్తం 1,06,439 మంది దరఖాస్తు చేసుకోగా అందులో బాలురు 56,494, బాలికలు 49,945 మంది ఉన్నారు. వీరి కోసం 293 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు 10 గంటల నుంచే విద్యార్థులకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పెన్ తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌పై ఫొటో ముద్రణ కాకుంటే.. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.






