1 July, 2026 | 7:56 PM

Breaking News

ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •  

ఆర్.కృష్ణయ్య ఫ్లెక్సీకి పాలాభిషేకం

13-05-2026 12:45 AM

దేవరకొండ,మే 12 : బీసీ గురుకులాల్లో తొలగించిన సీఈసీ గ్రూపులను తిరిగి యథాస్థానంలో కొనసాగించేలా చర్యలు తీసుకున్న రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఫ్లెక్సీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆర్. కృష్ణయ్య చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని బీసీ గురుకులాల్లో తొలగించిన గ్రూపులను పునరుద్ధరించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేష్, చేరుపెల్లి జయలక్ష్మి, ఎండి రంజాన్ బేగ్, చిలువేరు ముత్తమ్మ, బీమగోని శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.