13 May, 2026 | 2:13 AM

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

13-05-2026 12:34 AM

వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేత వినయ్ కుమార్

ముషీరాబాద్, మే 12 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి మహోత్సవం సంద ర్భంగా మంగళవారం గాంధీనగర్ డివిజన్ లోని చిక్కడపల్లి బాపునగర్ హనుమాన్ దేవాలయం, వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ. వినయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదా లు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో వివేక్‌న గర్ ఆలయం ఈఓ దేవనాథం, ఆలయ పున ర్నిర్మాణం కమిటీ చైర్మన్ జానకి సుధాకర్, బీజేపీ నాయకులు శ్రీకాంత్, ఆనంద్‌రావు, మధుగౌడ్, బాపునగర్ ఆలయ కమిటీ సభ్యులు శంకర్‌గౌడ్, శివశంకర్, ప్రవీణ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.