13 May, 2026 | 2:12 AM

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

13-05-2026 12:34 AM

పెబ్బేరు మే 12:పెబ్బేరులో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బ్రహ్మంగారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి పెబ్బేరు హిందూ జాగృతం ఆధ్వ ర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాన్ అష్టోత్తరం, లింగాష్టకం, కాలభైరవాష్టకం, భగవద్గీత పఠనం కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో బ్రహ్మంగారి సేవా సమితి సభ్యులు, హిందూ జాగృతం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.