2 July, 2026 | 12:21 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

హనుమాన్ జయంతిన సెలవు దినంగా ప్రకటించాలి

18-03-2026 12:00 AM

అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో వినతి..

బాన్సువాడ, మార్చి 17 (విజయ క్రాంతి): హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని కోరుతూ మంగళవారం అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో అధికారిని వసంతకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

అన్ని గ్రామా లలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కలిసి జరుపుకునే అతిపెద్ద హిందువుల పండుగ హనుమాన్ జయంతి అని అలాంటి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో వసంత సానుకూలంగా స్పందిస్తూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపుతామని ఆమె తెలిపారు.  అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం గురుస్వాములు అంబిలిపూర్ రాజు స్వామి,పాలకుర్తి దత్తు స్వామి, తేలి మహేష్ కుమార్ స్వామి, కల్లేటి వెంకటరమణ స్వామి, దాసరి సతీష్ స్వామి పాల్గొన్నారు.