calender_icon.png 2 October, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

02-10-2025 02:04:34 AM

వృతి వాఘాని టాలీవుడ్‌కు ఇటీవలే పరిచయమైన యువ కథానాయకి. ఈమె పుట్టిన రోజు గురువారమే. 2003, అక్టోబర్ 2న జన్మించిన ఈ ముంబయి ముద్దుగుమ్మ బాలనటిగా పలు ప్రకటనలు, టీవీ సీరియల్స్‌తో పేరు తెచ్చుకుంది. 2008లో జైశ్రీకృష్ణ సీరియల్‌లో బాల రాధ పాత్రతో బాగా ఫేమస్ అయింది.

బాలీవుడ్‌లో ‘పాటియాలా హౌస్’తో వెండితెరపై తొలిసారి మెరిసింది. తర్వాత బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది.  తెలుగులో ‘కొత్త కొత్తగా’ సినిమాలో నటించింది. ఇటీవల నారా రోహిత్‌తో కలిసి ‘సుందరకాండ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలుకరించింది.