calender_icon.png 2 October, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిలియనీర్ల జాబితాలోకి షారుఖ్

02-10-2025 12:22:00 AM

  1. ‘ఎం3ఎం’ జాబితాలో చోటు
  2. మొదటిస్థానంలో ముఖేశ్ అంబానీ, రెండోస్థానంలో గౌతమ్ అదానీ
  3.   350కి చేరిన దేశంలో బిలియనీర్ల సంఖ్య

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్ తొలిసారి బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. ‘ఎం3ఎం హురున్ ఇండియా రిలిస్ట్’ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన 2025 జాబితాలో రూ.12,490 కోట్ల నెట్‌వర్త్‌తో ధనవంతుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. జాబితాలో రూ.9.55 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో ముకేశ్ అంబానీనే మొదటిస్థానం లో ఉన్నారు.

ఆ తర్వాతిస్థానంలో గౌతమ్ అదానీ రూ.8.15 లక్షల కోట్లతో రెండోస్థానం, రోష్ణి నాదర్ మలోత్రా రూ.2.84 లక్షల కోట్లతో ఆమె భారత్‌లో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ధన వంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఇక ఈలిస్ట్‌లో ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీనే టాప్‌లో ఉన్నారు. ఈ జాబితా ప్రకారం దేశం లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 350 దాటింది. గడిచిన 13 ఏళ్లలో బిలియనీర్ల నెట్‌వర్త్ ఆరురెట్లు పెరిగింది. అంటే.. అక్షరాలా వారి ఆస్తు ల విలువ రూ.167 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో దాదాపు సగం.