calender_icon.png 2 October, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేకుండా నాగార్జున ఫొటోలు వాడొద్దు

02-10-2025 02:06:04 AM

అనుమతి లేకుండా తన ఫొటోలు, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారణ జరిపారు.

ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌లో, వస్తువులు, దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘిస్తున్నారని నాగర్జున తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో ధర్మాసనం.. నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడతామని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణకు చర్యలు తీసుకోవాలిన ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏఐ, జేఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది.