హ్యాపీ ఫాదర్స్ డే!
16-06-2024 12:53 AM
ఐఏఎస్ హోదాలో కుమార్తెను చూసి మురిసిన తండ్రి
గర్వంగా తన కూతురికి సెల్యూట్ n ఆమె ఐఏఎస్,తండ్రి పోలీసు ఉన్నతాధికారి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): ఏ తండ్రికైనా ఇంతకంటే ఏం కావాలి. తను అల్లారు ముద్దుగా పెంచిన కూతురు తనకంటే ఉన్నతమైన స్థాయిలో తన కార్యాలయానికే వస్తే ఆ తండ్రి కళ్లలో కనిపించిన సంతోషాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అలాంటి ఓ అరుదైన సంఘటన శనివారం తెలంగాణ పోలీస్ అకాడమీ (అప్పా)లో జరిగింది. అప్పాకు ట్రైనీ ఐఏఎస్ హోదాలో వచ్చిన ఉమాహారతిని చూసి అప్పాలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తండ్రి వెంకటేశ్వర్లు ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి, గౌరవంగా సెల్యూట్ చేసి మురిసిపోయారు. ఆ క్షణంలో ఆ తండ్రీ బిడ్డల కళ్లు చెప్పుకున్న ముచ్చట మాటలకు అందదు.






