4 March, 2026 | 1:36 AM

ఘనంగా హోలీ సంబరాలు

04-03-2026 12:00 AM

దమ్మపేట, మార్చి 3 (విజయక్రాంతి): మండల కేంద్రంతో పాటు, మండలంలోని గ్రామాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండే యువత, పిల్లలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ‘హోలీ శుభాకాంక్షలు‘ తెలుపుకున్నారు. దమ్మపేట వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. కొన్ని చోట్ల యువత డీజే పాటలు, డప్పు వాయిద్యాల మధ్య చిందులేస్తూ, కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.

కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఈ వేడుకల్లో పాల్గొని, స్నేహానికి ప్రతీకగా నిలిచారు. భారతీయులందరూ అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ‘రంగుల పండుగ‘ హోలీ. హోలీ వసంత రుతువు రాకను సూచిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం హోలీ పండుగను హిరణ్యకశిపుని సోదరి హోలిక దహనం, భక్త ప్రహ్లాదుని రక్షణ, హోలీ పండుగ పండుగ వెనుక ఉన్న ప్రధాన కథ. అందుకే మొదటి రోజు రాత్రి ’హోలిక దహనం’ చేస్తారు. ఇది పంటలు చేతికి వచ్చే కాలం. ప్రకృతిలో మార్పులను ఆహ్వానిస్తూ రంగులతో వేడుక చేసుకుంటారు. ఈ పండుగలో ధనిక, పేద, కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసిపోయి, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.