ఘనంగా మహిళా దినోత్సవం
కరీంనగర్ క్రైం/ముకరంపుర, మార్చి 8 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం వివిధ సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జెండాను మాజీ ఎంపీటీసీ, ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గూడెం లక్ష్మీ ఎగురవేశారు.
మహిళలంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి కొట్టే అంజలి, కార్యవర్గ సభ్యురాలు నక్క కేతవ్వ, నాయకురాళ్లు కసిరెడ్డి లతశ్రీ, ఎలిశెట్టి భారతి, శ్రీలత, గుమ్మడి సుజాత, తుమ్మ సుమ, మున్నీ, రజిత, శారద, గోపు విజయ, వినోద తదితరులు పాల్గొన్నారు.
మహిళా సిబ్బందికి సన్మానం..
మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐలు నరేష్, లక్ష్మారెడ్డి, సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వ హాస్పిటల్లో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఎర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, టియుసిసి కేంద్రకమిటీ సభ్యులు బండారి శేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు పి. అరుణ్, నాయకులు శారదా, పద్మ, అరుణ, సకిన బేగం, రజియా, మమతా, సుకన్య, శ్వేతా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పురస్కారాల ప్రదానం...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాగేశ్వరి డిగ్రీ, పీజీ కళాశాలలో విశిష్ట మహిళా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం, కంకణాల రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో..
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గ నాయకులు కాసరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు. అనంతరం వేముల కళావతి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి మహిళలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గలి శ్రీధర్, జనసేన నాయకురాళ్లు వేముల కళావతి, నాగశ్రీ, మౌనిక, రమ్యశ్రీ, ప్రభావతి, సునీత, నీతు వర్మ, వరలక్ష్మి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యా లయం, ప్రాంతీయ కేంద్రం సమన్వయ అధికారి సత్యప్రకాష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మహిళా సాధికారిత చాలా ప్రాముఖ్యమని తెలిపారు. మహిళా ఉపన్యాసకులు నాగజ్యోతి, విక్టోరియా, వసంత లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పర్శరాంరావ్, కన్నం రమేష్, వెంకటరెడ్డి, రాజు, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కరీంనగర్. డిపోలో..
ఆర్టీసీ కరీంనగర్-2 డిపోలో జిల్లా స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ స్థాయిలోని మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం ఓ లు భూపతి రెడ్డి, మల్లేశం, డీఎంలు శ్రీనివాస్, విజయ మాధురి, సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.




