15 August, 2026 | 1:43 AM

దేశభక్తి ఎప్పుడూ ఉండాలి..!

15-08-2026 12:48 AM

బీజేపీ డివిజన్ అధ్యక్షులు రాంబాబు గౌడ్ 

రామచంద్రపురం, ఆగస్టు 14: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, వైస్ ప్రెసిడెంట్ కోటే రవి కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. తెల్లాపూర్లోని ప్రధాన వీధుల మీదుగా విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ర్యాలీకి పోలీసులు సహకరించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి వీధి, ప్రతి వాడలో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, పోలీసు వారికి ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, నరసింహ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, నరసింహ, శుభాన్ రెడ్డి, కోటే ప్రవీణ్, రావి తదితరులు పాల్గొన్నారు.