15 August, 2026 | 1:49 AM

బండ్లగూడలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

15-08-2026 12:00 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బండ్లగూడ జాగీర్లో శుక్రవారం మహా తిరంగా ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి కాళీమందిర్ వరకు సాగిన ర్యాలీని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్కుమార్ గౌడ్, వై.శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ర్యాలీలో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు నీరుడు పవన్ సాయి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతీయ సమైక్యత, దేశభక్తి చాటేలా ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు