18 July, 2026 | 11:47 PM

రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి

02-06-2024 02:13 AM

విశ్రాంత అధ్యాపకులు జీ హరగోపాల్

టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్

రాజేంద్రనగర్, జూన్ 1 (విజయ క్రాంతి) : తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకులు జీ హర గోపాల్ అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం, బోధనేతర సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన తెలంగా ణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు ఆరోగ్యకరంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.

తెలంగాణలో గత దశాబ్ధం ఓ విషాదంగా మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడే తెలంగాణ వచ్చినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయపరంగా తెలంగాణ అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఎన్నో ఉన్నా గత ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చలు, సంప్రదింపులకు తలుపులు తెరవడం హర్షదాయకమన్నారు. అనంతరం టీజేఎస్ అధ్య క్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడు తూ.. విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి మనం దరం బాధ్యతలను నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపించినప్పుడే అమరవీరుల త్యాగాలకు అసలైన ఫలితం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి, టాసా అధ్య క్షుడు డాక్టర్ విద్యాసాగర్, బోధనేతర సిబ్బం ది సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ వనమాల, ప్రజాగాయకుడు గద్ధర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెల, జర్నలిస్టులు అప్పారెడ్డిగూడెం భీమయ్య, మేకల దామోదర్‌రెడ్డి, పాలేపల్లి వెంకటేష్, ఎద్దుల సుజీవన్‌రెడ్డి, పి.సూర్యకిరణ్ పాల్గొన్నారు.