19 July, 2026 | 1:38 AM

త్వరలోనే నూతన డ్రైనేజీ పైపులైన్లు

02-06-2024 02:03 AM

ఎల్బీనగర్, జూన్ 1 : కొత్తపేట డివిజన్‌లోని అన్ని కాలనీల్లో పురాతన డ్రైనేజీ పైపులైన్‌లను తొలిగించి, నూతనంగా పటిష్టమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ వేయిస్తానని కొత్తపేట కార్పొరేటర్ పవన్‌కుమార్ హామీ ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో  గోకుల్‌నగర్‌లో డ్రైనేజీ పైపులైన్ ధ్వంసమైన ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి డ్రైనేజీ పైపులైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పవన్‌కుమా ర్ మాట్లాడుతూ..  చాలాచోట్ల డ్రైనేజీ పైపులైన్లు అపార్ట్‌మెంట్ కింది భాగం నుంచి వేశారని, దీంతో పైపులైన్ పగిలి మురుగునీరు రోడ్లపై పారుతుందన్నారు. కొత్తపేట డివిజన్ మూసీ ప్రాంతాల్లో ముంపు సమస్యను పరిష్కరి స్తానని హామీ ఇచ్చారు. కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పైపులైన్ వేయిస్తానని తెలిపారు. వానకాలంలో వచ్చే ఇబ్బందులను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. జలమండలి ఇన్‌చార్జి ఆరిఫ్, సూపర్‌వైజర్ దయాకర్, జీఎం బలరాం, డిప్యూటీ జీఎం శ్రీనివాస్ కాలనీవాసులు పాల్గొన్నారు.