calender_icon.png 10 August, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కె ఎంసీ విద్యార్థులకు వేధింపులు

07-08-2025 06:37:29 PM

కీచక ప్రొఫెసర్లపై ప్రిన్సిపల్ కు ఫిర్యాదు..

వరంగల్ (విజయక్రాంతి): కాకతీయ మెడికల్ కాలేజీ(Kakatiya Medical College)లో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సైక్రియాటిస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రొఫెసర్ల చేత వేధింపులకు గురవుతున్నట్లు వారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ఎస్. సంధ్యాకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో కూడా కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల విద్యార్థుల మధ్య వేధింపులు జరిగి పీజీ విద్యార్థిని ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా కనబడ్డాయి అదేవిధంగా ప్రొఫెసర్లు విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినీలు ఆరోపిస్తున్నారు.

ఆరోపణల విషయమై ప్రిన్సిపల్ సంధ్యారాణి డిపార్ట్మెంట్ లో పనిచేసే ఇద్దరు మహిళ, ముగ్గురు పురుష ప్రొఫెసర్ల చేత విచారణ కమిటీని వేసి నిజనిర్ధారణ తేల్చాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. విచారణ అనంతరం తప్పు జరిగినట్టు తెలిసినట్లయితే సంబంధిత ప్రొఫెసర్ పై కట్టిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి  మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ కమిటీ పెట్టాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా గతంలో కొనసాగిన విధంగా మెంటర్ షిప్ ప్రోగ్రాం కూడా కొనసాగిస్తామని చెప్పారు. తద్వారా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసే అవకాశం ఉందని అన్నారు.