calender_icon.png 7 August, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు

07-08-2025 06:38:49 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మైనార్టీ కళాశాలలో గురువారం ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఐదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో నూతనంగా చేరిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి కళాశాలకి ఆహ్వానించారు. అనంతరం అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎండి నీలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.