02-12-2025 01:40:03 AM
హైదరాబాద్, డిసెంబర్ 1 : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆసియాకప్‌లో గాయపడి దాదాపు రెండు నెల లుగా జట్టుకు దూరమైన పాండ్యా ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తన సొంత రాష్ట్రం బరోడా తరపున బరిలోకి దిగబోతున్న హార్థిక్ సౌతాఫ్రికాతో టీ20 సిరీ స్‌కు ముందు సత్తా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.
ఆసియాకప్ ఆడుతుండగా ఎడమ కాలి తొడకండరాల నొప్పితో ఇబ్బందిపడిన పాండ్యా గత నెల రోజులుగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉండి కోలుకున్నాడు. బౌలింగ్ సాధన చేస్తూ ఫిట్‌నెస్ నిరూపించుకున్న పాండ్యా ఇప్పుడు సయ్య ద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడతాడు. అక్కడ కూడా పాండ్యా ప్రదర్శనను బీసీసీఐ సెలక్టర్లు పరిశీలించి తుది నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదికలో అంతా సానుకూలంగా ఉంటే సౌతాఫ్రికాతో సిరీస్‌కు పాండ్యా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచకప్ ప్రిపరేషన్‌కు సౌతాఫ్రికాతో సిరీస్ భారత కీలక ఆటగాళ్లందరికీ ముఖ్యమైనది కానుంది.