02-12-2025 01:42:40 AM
రాయ్‌పూర్, డిసెంబర్ 1 : భారత్,సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు మంచి క్రేజ్ కనిపిస్తోంది. కేవలం టీ20లకే ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తారని అనుకుంటే తొలి వన్డేకు హౌస్‌ఫుల్ అయిం ది. దీనికి కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే.. పైగా తొలి వన్డేలో వీరిద్దరూ అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంట ర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. రోహిత్ హాఫ్ సెంచరీ కొడితే.. కోహ్లీ సెంచరీ బాదేశాడు. ఇప్పుడు రెండో వన్డేపై అంచనాలు మరింత పెరిగాయి.
రోకో జోడీ సూపర్ ఫామ్ ప్రభావంతో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ న్‌లైన్‌లో పెట్టిన తొలి దశ టికెట్లు కేవలం గంట వ్యవధిలోనే అమ్ముడవగా.. కౌంటర్ల దగ్గర భారీగా బారు లు తీరిన అభిమానులు సెకండ్ ఫేజ్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాంఛీ నుంచి సోమ వారం సాయంత్రం రాయ్‌పూర్ చేరుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు భారీ భద్రత మధ్య హోటల్‌కు వెళ్లాయి.
రెండు జట్లు కూడా రాయ్‌పూర్ స్టేడియంలో మంగళవారం ప్రాక్టీస్ చేయనున్నాయి. తొలి వన్డే గెలిచి జోష్ మీదున్న టీమిండి యా అదే ఊపులో రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుండగా.. సిరీస్‌ను సమం చేయాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.