20 August, 2026 | 5:56 AM

మౌలిక వసతుల లేమితో అవస్థలు

20-08-2026 12:00 AM

తక్షణ పరిష్కారం చూపాలని వేడుకోలు              

జవహర్‌నగర్, ఆగస్టు 19 (విజయక్రాం తి): అసలే మురుగు నీటి సమస్య... దానికి తోడు కాలనీలో పందుల స్త్వ్రర విహారం, మౌలిక వసతులైన డ్రైనేజీ, మురుగునీరు, విద్యుత్ సమస్యలతో కాలనీలు సతమతం.... ఇవీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని పలు కాలనీల దుస్థితి... వెరసి జవహర్ నగర్ లోని వెంకటేశ్వర నగర్, భక్తాబాయ్ కాలనీల  దుస్థితి.

మౌలిక వసతుల కొరతతో భక్తాబాయ్ కాలనీ, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ కార్పొరేటర్ బిజెపి నాయకులు పానుగంటి బాబు మీడియాతో తమ ఆవేద న వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న త మ ప్రాంతాలలో కనీస సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని ప్రధానం గా రోడ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుందని పలుచోట్ల రోడ్లు గుంతల మయంగా మారాయ ని దీంతో వాహనదారులు పాదచారులకు ఇబ్బందులు పడుతున్నారని వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తమ ఆవేదన వెలుబుచ్చారు. రోడ్లపై నీ రు నిలవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, డ్రైనేజీ సక్రమంగా మురు గుతో సహవాసం చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ స్తంభాల లేక రాత్రి పలు ప్రాంతాలు అంధకారంలో ఉంటున్నాయన్నారు.