20 August, 2026 | 3:15 AM

రేషన్ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

20-08-2026 12:00 AM

నిబంధనలు పాటించని షాపులపై చర్యలు ఉంటాయి: అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ 

జడ్చర్ల ఆగస్టు 19: రేషన్ బియ్యం కు బదులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని విజయక్రాంతి దినపత్రిక ’దర్జాగా రేషన్ దుందా’ అనే కథనం బుధవారం ప్రచురితం చేసింది. ఈ కథనంపై స్పందించిన అదనపు కలెక్టర్ జేఎల్బి హరిప్రియ జడ్చర్లలోని మదిన కాలనీ లోని రేషన్ షాపును తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్ దుకాణంలో బియ్యం నిల్వలు, పంపిణీ ప్రక్రియ, రికార్డులను అదనపు కలెక్టర్ పరిశీలించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సక్రమంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ చేయాలని నిర్లక్ష్యం వహిస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలో జడ్చర్ల తహశీల్దార్ నర్సింగరావు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ, డీటీ తదితరులు పాల్గొన్నారు.