3 June, 2026 | 3:51 PM

ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

03-06-2026 02:50 PM

ఏడుపాయల్లో కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు 

భారీగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 

పాపన్నపేట,జూన్03: మాజీ మంత్రి, భారాస ట్రిపుల్ షూటర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో హరీష్ రావు పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం వద్ద కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేశారు.

ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కన్నీరు ఎక్కడ ఉంటే తన్నీరు అక్కడ ఉండి ప్రజల కన్నీరు తూడుస్తారన్నారు. తెలంగాణలో హరీష్ రావు ఓ బ్రాండ్ అని కొనియాడారు. హరీష్ రావు సూచనల మేరకు నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో హరీష్ రావు ఉద్యమ ఒక కెరటంగా తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషించారన్నారు. హరీష్ రావు సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శనం చేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సోములు, బాలాగౌడ్,  గురుమూర్తి గౌడ్, శ్రీనాథ్, సర్పంచులు సురేష్, గంట రాణి సుధీర్, నాయకులు సొంగ పవిత్ర దుర్గయ్య, కాశీనాథ్ రావు, శ్రీనివాస్,  కొండల్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, జగదీష్ చారి, కిరణ్ గౌడ్, నవీన్, సాయి, దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.