calender_icon.png 28 October, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్ రావుకి పితృవియోగం

28-10-2025 08:35:56 AM

హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకి పితృవియోగం(Harish Rao's father dies) కలిగింది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ(Thanneeru Satyanarayana) కన్నుమూశారు. సత్యనారాయణ పార్థివదేహం సందర్శనార్థం హైదరాబాద్‌లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఉంచారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం నాడు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

హరీశ్ రావు తండ్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి పట్ల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ కవిత ఎక్స్ లో పోస్టు చేశారు.