28-10-2025 08:48:05 AM
హైదరాబాద్: మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూశారు. తన బావ, హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
సత్యనారాయణ(Thanniru Satyanarayana Rao) పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించిన కేసీఆర్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ పార్థివ దేహన్ని సందర్శనార్థం హైదరాబాద్ లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయిని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది